
-
గోపురంతో పోస్టల్ స్టాంప్ విడుదల
-
దేశంలోనే ఇదే మొదటిసారి
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడ కోదండరామస్వామి ఆలయ గోపురాలకు అరుదైన గుర్తింపు లభించింది. ఆలయ ప్రత్యేకత ఉట్టిపడేలా తపాలాశాఖ ప్రత్యేక కవర్ విడుదల చేయనుంది. గోపురం పేరుతో పోస్టల్ కవర్ విడుదల కావడం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఆలయాన్ని 1889లో ప్రతిష్ఠించారు.
1934లో ద్వారంపూడి సుబ్బిరెడ్డి, రామిరెడ్డి వంశీయులు… లక్ష్మణ సమేత సీతారాముల విగ్రహాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నిత్య పూజలు, శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 1948లో మొదటిసారి తూర్పు గోపురాన్ని నిర్మించారు. ఆరేళ్లపాటు శ్రమించి…. మెరుగులు దిద్ది తొమ్మిది అంతస్తుల్లో 160 అడుగుల ఎత్తులో తూర్పుగోపురాన్ని పూర్తి చేశారు. పోస్టల్ కవర్ ఆవిష్కరణతో జంట గోపురాల ఘనకీర్తి దేశమంతా పరిచయమవ్వనుందని తపాలా శాఖ పేర్కొంది. గోపురాల కవరు ఆవిష్కరణ నేడు ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నారు.





