News

గుప్తనిధుల కోసం మ‌న్యం ఆలయాల్లో తవ్వకాలు

658views
  • పోలీసులకు గిరిజనుల ఫిర్యాదు

విశాఖ‌ప‌ట్నం: గుప్త నిధుల పేరిట విశాఖ మన్యంలో పలువురు దుండగులు దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. పురాతన విగ్రాహాలపై కన్నేసిన ఓ ముఠా రాత్రి సమయాల్లో దేవాలయాల్లో చొరబడి విగ్రహాలను తస్కరిస్తున్నారు. తాజాగా.. విశాఖ మన్యం చింతపల్లి మండలం ఎర్రబొమ్మల పంచాయతీ పరిధిలోని రోలంగి గ్రామ దేవత సుంకులమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు.

ఈ ఘటనపై గ్రామ సర్పంచి పండయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ తమ గ్రామంలోని దానుడు, భూదేవి ఆలయాల్లో తవ్వకాలు జరిపారన్నారు. గుప్త నిధుల పేరిట తవ్వకాలు తమను భయాందోళనలకు గురిచేస్తున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటంతో పాటు సమాచార వ్యవస్థకోసం సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి