News

పొన్నాపురంలో వేడుకగా దత్త జయంతి, బంటుపల్లెలో హిందూ స‌మ్మేళ‌నం

419views

నంద్యాల: క‌ర్నూలు జిల్లా, నంద్యాల శివారు పొన్నాపురంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఈ నెల 18న ఘ‌నంగా ద‌త్త జ‌యంతి జ‌రిగింది. స్థానిక ధ‌ర్మ జాగ‌ర‌ణ స‌మితి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో భ‌జ‌న కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. భ‌క్తుల‌కు వ‌క్త‌లు గురు ద‌త్తాత్రేయుని జీవిత విశేషాలు వివ‌రించారు. భజన బృందానికి స‌మితి వారు రూ.3,500 విలువ చేసే డోల‌క్‌ను ప్ర‌దానం చేశారు.

ఈ సంద‌ర్భంగా వారు చేస్తున్న ధార్మిక కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు విభాగ ప్రముఖ్ రాంప్రసాద్, నంద్యాల ధర్మ జాగరణ ప్రముఖ్ చంద్రశేఖర ప్రసాద్, పొన్నా పురం ధర్మ జాగరణ సమితి సభ్యుడు నరసింహులు, విశ్రాంత అధ్యాపకుడు లింగేశ్వర రావు, బాబు, ఆర్‌.ఎస్‌.ఎస్ కార్య‌క‌ర్త కాల్వ పెద్ద‌నాగ‌న్న‌, మాతృమూర్తులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

బంటుపల్లెలో హిందూ స‌మ్మేళ‌నం

కర్నూల్ జిల్లా, దేవనకొండ మండలం, బంటు పల్లె గ్రామంలో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం ఈ నెల 20న వైభ‌వంగా జ‌రిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ” గో” పూజా కార్యక్రమం, నగర సంకీర్తన, గోమాత ఊరేగింపు జరిగింది. భ‌క్తుల‌కు గోమాత విశిష్ట‌త‌ను తెలిపారు.

తదనంతరం సభా కార్యక్రమంలో దేవనకొండ మండలం ధర్మ జాగరణ ప్రముఖ్‌ శ్రీనివాస యాదవ్, సహ ప్రముఖ్ మల్లికార్జున్ రెడ్డి, కర్నూల్ విభాగ్ ధర్మ జాగరణ ప్రముఖ్ రాంప్రసాద్, గ్రామ పెద్దలు రాష్ట్రీయ స్వయంసేవక్ పత్తికొండ ఖండ బౌద్ధిక్‌ ప్రముక్ ర‌ఘు, దేవనకొండ మండల సంపర్క ప్రముఖ్ ఉచ్చీరప్ప , శ్రీ రామాంజనేయులు, పులికొండ రామాంజనేయులు, కౌలుట్ల, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి