News

వెయిట్ లిఫ్టింగ్‌లో భారత క్రీడాకారిణి అరుదైన రికార్డు

466views

న్యూఢిల్లీ: కామన్​వెల్త్ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్‌ పూర్ణిమ పాండే మహిళల +87 కిలోల విభాగంలో స్వర్ణం గెలిచారు. ఆమె.. వచ్చే ఏడాది జరగనున్న కామన్​వెల్త్​ గేమ్స్​కు నేరుగా క్వాలిఫై అయింది. పూర్ణిమ 229 కిలోలు (102కేజీ+127కేజీ) ఎత్తింది. స్నాచ్‌లో రెండు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో మూడు, మొత్తంలో మూడు రికార్డులు సృష్టించింది. ఈ క్రమంలో ఎనిమిది జాతీయ రికార్డులు నెలకొల్పింది. కామన్​వెల్త్​ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్​షిప్​లోని వివిధ కేటగిరీల్లో స్వర్ణం గెలిచిన వారు 2022 కామన్​వెల్త్ క్రీడలకు నేరుగా అర్హత సాధిస్తారు. మిగతా వారు తమ ర్యాంకింగ్స్​ను బట్టి క్వాలిఫై అవుతారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి