-
ప్రయాణికుల్లో బిపిన్ రావత్, కుటుంబ సభ్యులు
చెన్నై: తమిళనాడులోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తో పాటు మరో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. హెలికాప్టర్ కూలిన తరువాత మంటలు చెలరేగాయి. తీవ్ర గాయాల పాలైన ముగ్గురు అధికారులను ఆస్పత్రికి తరలించారు. కూనూరు సమీపంలో ఈరోజు దుర్ఘటన సంభవించింది.
ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు నీటితో మంటలు ఆర్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఇంతకీ ఈ హెలికాప్టర్‌లో ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరికి గాయాలయ్యాయి? లాంటి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో బిపీన్ రావత్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్టు ఆండియన్ ఆర్మీ ధ్రువీకరించింది.
ఎంఐ హెలికాఫ్టర్‌లో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారు. నీలగిరి జిల్లా కూనుర్ వెల్లింగటన్‌లో సైనిక అధికారుల శిక్షణ కళాశాల కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ జరిగే కార్యక్రమానికి హాజరుకావడానికి కొయంబత్తూరులోని ఆర్మీ సెంటర్ నుంచి ఈ హెలికాప్టర్ ప్రయాణమైంది.
Source: Tv9