News

అల్‌-కేరళ మిలిటరీ బ్రిగేడ్‌ చివరి జిహాద్‌కు రడీ!

591views
  • 3,200 స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్‌

  • వీరిలో 40% మహిళలే…

  • వణుకుపుట్టిస్తున్న ‘యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌ ఇండియా’ నివేదిక

తిరువనంతపురం: కేరళ గతం నుంచి ఇస్లామిక్‌ ఉగ్రవాదులకు పుట్టిల్లు. ఇప్పుడిది అత్యంత ప్రమాదకర ప్రదేశంగా మారిపోయింది. ‘యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌ ఇండియా’ ప్రచురించిన కొత్త నివేదికలో వణుకుపుట్టించే అంశాలు ఉన్నాయి. కేరళలో ఐసిస్‌తో సంబంధం ఉన్న 3,200 స్లీపర్‌ సెల్స్‌ ఉన్నట్టు జన్మభూమి డైలీ నివేదించింది.

ప్రతి స్లీపర్‌ సెల్‌లో 10 మంది సభ్యులు ఉంటారని, మొత్తం 32,000 మంది స్లీపర్‌ సెల్‌ సభ్యులు కేరళలో చివరి జిహాద్‌కు సిద్ధమవుతున్నారని ఆ నివేదిక పేర్కొంది. అయితే, వీరిలో దాదాపు 40% మంది మహిళలు ఉన్నారని, వారిలో ఎక్కువ మంది ముస్లింలుగా మారారని నివేదిక పేర్కొంది.

ఈ స్లీపర్‌ సెల్‌ సభ్యులు సోషల్‌ మీడియాలో జిహాద్‌ ఆలోచనలను వ్యాప్తి చేయడానికి, ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రజలను ఆకర్షించేలా చేయడానికి శిక్షణ పొందారు. వారు ఆయుధాలను ఉపయోగించడంలోనూ శిక్షణ పొందారు. కొందరు బాంబు తయారీలో నిపుణులు. సినిమా, వినోదం సహా అన్ని ప్రధాన రంగాల్లో స్లీపర్‌ సెల్‌ ఉందని ఆ నివేదిక హెచ్చరిస్తోంది. వీరంతా భారతదేశం వెలుపలనుంచి వచ్చి పడే డబ్బు, సెక్స్‌ సౌక‌ర్యాలు, అధిక జీతంతో కూడిన ఉద్యోగాలను ఆఫర్‌ చేయడం ద్వారా ఆకర్షితులయ్యారని తెలుస్తోంది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి