హిందువులను క్రిస్టియన్లుగా మార్చడానికి దేశవ్యాప్తంగా కొన్ని శక్తులు విశ్వ ప్రయత్నాలే చేస్తున్నాయి. అలాంటి ఓ వ్యక్తి గురించి న్యూస్ 18 మీడియా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఓ క్రిస్టియన్ మతబోధకుడు హిందువులను మత మార్పిడి చేయాలని ప్రయత్నించాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్ లో చోటుచేసుకుంది.
రతియాకు చెందిన యువకుల ఇంటికి పలుమార్లు ఆ మతబోధకుడు వెళ్ళాడు. వారిని క్రిస్టియానిటీని స్వీకరించమని బలవంతపెట్టాడు. ఇలా చాలా సార్లు ఆ వ్యక్తి ప్రయత్నించాడు. అంతేకాకుండా ఎవరైనా తాను చేస్తున్న పని గురించి పోలీసులకు చెబితే చంపేస్తానని బెదిరించాడట. దీంతో భయపడిపోయిన యువత ఎస్పీ ధర్మ బీర్ పూనియాకి సమాచారం అందించారు. ఈ ఘటనపై పూనియా స్పందిస్తూ.. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
ఈ విషయం తెలుసుకున్న భజరంగదళ్ జిల్లా కన్వీనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మతమార్పిడులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తాము గతంలోనే ఫిర్యాదు చేశామని.. అయినా ఒక్కరు కూడా పట్టించుకోలేదని చెప్పారు. అంతేకాకుండా మతమార్పిడులకు పాల్పడుతున్న వ్యక్తులను అడ్డుకుంటామని.. వారు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని చెప్పారు.
Source : Bharath Today.
https://www.bhaarattoday.com/news/national/story/30131.html