News

జనవరి 10 నుంచి అయోధ్య కేసును విచారించనున్న ఐదుగురు సభ్యుల సుప్రీమ్ ధర్మాసనం.

585views

న్యూఢిల్లీ: రామ జన్మభూమి అయోధ్య, బాబ్రీ మసీదు వివాదం అంశంపై వాదనలు వినేందుకు సుప్రీం కోర్టు ఐదుగురు జడ్జిలు సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. జనవరి 10వ తేదీ నుంచి ఈ ధర్మాసనం వాదనలు విననుంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఏర్పడిన ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఉదయ్ లలిత్, జస్టిస్ చంద్రచూడ్‌లు ఉన్నారు. ఈ అంశంపై సీజేఐ గడిచిన శుక్రవారం తీర్పును వెలువరిస్తూ ముగ్గురు సభ్యులుగా గల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టనుందని పేర్కొంది. తాజాగా ఐదుగురు సభ్యులుగా గల బెంచ్ ఏర్పాటైంది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కోరుతూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వివాద అంశంగా ఉన్న మొత్తం 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అకారా, రామ్ లల్లాలకు సమ భాగాలుగా పంచాలని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీంను ఆశ్రయించిన విషయం పాఠకులకు తెలిసిందే.

Source:One India

https://telugu.oneindia.com/news/india/5-judge-constitution-bench-supreme-court-hear-ayodhya-case-on-thursday-237629.html