456
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కొవిడ్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ కలవరపెడుతున్న వేళ ప్రధాని సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. వర్చువల్గా జరిగిన ఈ సమావేశంలో దేశంలో కొవిడ్ నిరోధక చర్యలు, వ్యాక్సినేషన్‌పై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, కేంద్ర వైద్యఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Source: EtvBharat