390
-
నేపాల్ మాజీ ప్రధాని ఓలీ వ్యాఖ్య
ఖాట్మండు: రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే వివాదస్పద కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్లను చర్చల ద్వారా భారత్ నుంచి తీసుకుంటామని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ చైర్మన్, మాజీ ప్రధాని ఓలీ తెలిపారు. ఆ పార్టీ 10వ సాధారణ సమావేశంలో ఓలి ఈ వ్యాఖ్యలు చేశారు. నేపాల్ స్వాతంత్య్రాన్ని, సార్వభౌమత్వాన్ని రక్షించే విధంగా తమపార్టీ పనిచేస్తుందని తెలిపారు. ఇరుదేశాల ఆసక్తి, లాభాలను దృష్టిలో ఉంచుకునే అంతర్జాతీయ సంబంధాలు ఏర్పరచుకుంటామన్నారు.