శబరిమల అయ్యప్ప ఆలయ వివాదంలో భారతీయ జనతా పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారిని కేరళ ప్రభుత్వం ఎంతగానో హింసిస్తోంది. వారి మీద కేసులు పెట్టడం.. విషయం చెప్పకుండా అరెస్ట్ చేయడం వంటి ఎన్నో పనులు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక లోకల్ కమ్యూనిస్టు నేతలు అయితే గూండాలను ఉసి గొలిపి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా కూడా వాటిపై స్పందన కరువైంది. ఇలాంటి తరుణంలో వారి మీద దాడులు మరిన్ని ఎక్కువయ్యాయి. ఏకంగా ఇళ్ళ మీదకే బాంబులు వేస్తున్నారు.
కోయిలాండి ప్రాంతంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేత వి.కె.ముకుందన్ ఇంటి మీద నాటు బాంబులను వేశారు. కొందరు దుండగులు ఆయన ఇంటి చుట్టుపక్కలే తచ్చాడుతూ ఉన్నారట.. ఇంతలోనే ఇలా నాటుబాంబులతో దాడి చేశారు. ఇంకా 18 నాటుబాంబులను సోమవారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ముకుందన్ వర్గం అప్రమత్తంగా ఉండడంతో ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇప్పటి దాకా 2817 కేసులను పోలీసులు రిజిస్టర్ చేయగా.. 6914 మందిని అరెస్ట్ చేశారు.
Source : Bharath Today
https://www.bhaarattoday.com/news/national/story/30099.html