News

‘బ్యాడ్ చీఫ్ మినిస్టర్’ అని గూగుల్‌లో టైప్ చేస్తే ఏ ముఖ్యమంత్రి వస్తున్నారంటే?

467views

తిరువనంతపురం: దేశంలో బ్యాడ్ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌లో పినరాయి విజయన్ కనిపిస్తున్నారు. శబరిమల ఆలయం విషయంలో ఆయనపై భక్తులు, హిందూ సంస్థలు నిప్పులు చెరుగుతోన్న విషయం తెలిసిందే. గూగుల్‌లో బ్యాడ్ చీఫ్ మినిస్టర్ అని టైప్ చేస్తే సెర్చింజన్‌లో పినరాయిని చూపిస్తోంది. శబరిమల విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు భక్తులు, హిందూ సంస్థల నుంచి పినరాయి విజయన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. మత ఆచారాల్లోకి కోర్టులు రావడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర మతాల ఆచారాలలోను ఇలాగే జోక్యం చేసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పును అమలు చేయాలని విజయన్ ప్రభుత్వం నిర్ణయించుకోవడం గమనార్హం. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కేరళలో భక్తులు, మహిళలు, హిందూ సంస్థలు, విపక్ష పార్టీలో ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నాయి. పినరాయి ప్రభుత్వం భక్తుల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నాలు చేయకుండా మరింత రెచ్చగొట్టేలా వుమెన్ చైన్‌కు ప్లాన్ చేసిందనే విమర్శలు వస్తున్నాయి. పోలీసుల భద్రత మధ్య ఇద్దరు మహిళలను అయ్యప్ప గుడిలోకి తీసుకెళ్లడం కూడా ఆయనకు మరక మిగిల్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్‌లో బ్యాడ్ సీఎం అని అడిగితే పినరాయి విజయన్‌ను చూపిస్తోంది. గతంలో ఇడియట్ అని కొడితే డొనాల్డ్ ట్రంప్ వచ్చింది.

Source : One India

https://telugu.oneindia.com/news/india/bad-chief-minister-india-google-says-pinarayi-vijayan-237594.html