
577views
విజయవాడ: మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ బిల్లును ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. ఇదే విషయాన్ని రాజధాని కేసుల కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ కూడా తెలిపారు. అటు ఏపీ కేబినేట్ భేటిలో కూడా వికేంద్రీకరణ, సీఆర్దీఏ రద్దు బిల్లులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, ప్రస్తుతం ఉన్న బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని.. కొన్ని మార్పులతో కొత్తగా మళ్లీ సభలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడుతుందనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. బిల్లుపై ప్రకటన చేయనున్నారు.
Source: Tv9