-
సుప్రీం కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: బలవంతపు వసూళ్ళ కేసులో ముంబై పోలీసు మాజీ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్‌కు అరెస్ట్ నుండి రక్షణ కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయన ఎక్కడ ఉన్నారనే విషయాన్ని తమకు చెప్పాలని కోర్టు ఆదేశించింది. ఆ వివరాలు చెప్పేంత వరకు పరమ్‌బీర్ పిటిషన్‌పై విచారణ చేపట్టబోమని కోర్టు స్పష్టం చేసింది.
తనపై నమోదైన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానాన్ని పరమ్‌బీర్ ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆయన ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని తమకు వెల్లడించాలని సుప్రీం ఆదేశించింది. పరమ్‌బీర్ దేశం విడిచి పారిపోయినట్టు తెలుస్తోందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది.
‘మీరు ఎక్కడ ఉన్నారు, ఈ దేశంలో ఉన్నారా? లేదంటే వెలుపల ఉన్నారా?, లేదా ఏ దేశంలో ఉన్నారు? మిగిలిన వివరాలను తరువాత పరిశీలిస్తాం. ముందుగా ఎక్కడ ఉన్నది కోర్టుకు తెలియజేయండి’ అని ప్రశ్నించింది. ఆయనకు బెయిల్ కావాలంటే బయటకు రావాల్సిందేనని పరమ్‌బీర్ తరపు న్యాయవాదిని జస్టిస్ కౌల్ ఆదేశించారు.
న్యాయవ్యవస్థపై విశ్వాసం లేకుండా వ్యవహరించడం సరికాదని, ఆయన పోలీస్ కమిషనర్ అయితే మాత్రం మినహాయింపు ఉండదని, ఆచూకీ వెల్లడించినపుడే కోర్టు నుండి రక్షణ లభిస్తుందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అటార్నీ పవర్‌తో ఈ పిటిషన్ దాఖలు చేయడంపై స్పందిస్తూ.. ‘మీరు విదేశాల్లో కూర్చుని .. అటార్నీ అధికారాల ద్వారా చట్టపరమైన సాయం తీసుకున్నట్లయితే.. తీర్పు మీకు అనుకూలంగా ఉంటేనే భారత్‌కు వస్తారని అర్థమైంది. మీ అభిప్రాయం ఏమిటో తెలియదని, ఎక్కడ ఉన్నారో తెలిపేంత వరకు విచారణ చేపట్టేది లేదు.. రక్షణ కల్పించేంది లేదు’ అని జస్టిస్ కౌల్‌తో కూడిన ఏకసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
Source: Nijamtoday