
న్యూఢిల్లీ: అమెరికా నుంచి ఆధునాతన డ్రోన్ల కొనుగోలు ప్రతిపాదన తుది దశకు చేరాయి. రూ.22 వేల కోట్ల విలువైన 30 మల్టీ మిషన్ డ్రోన్ల కొనుగోలు ప్రతిపాదనలను రక్షణ సంబంధిత కొనుగోళ్ల మండలి(డీఏసీ) అనుమతించనుంది. డీఏసీ ఆమోదం తర్వాత.. ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ ఆమోదించాక డ్రోన్ల కొనుగోలు ప్రతిపాదన ఖరారు కానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 30 డ్రోన్లలో త్రివిద దళాలు 10చొప్పున తీసుకోనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
-
పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పటానికే…
జమ్ముకాశ్మీర్‌లో పాక్ డ్రోన్ల దాడికి పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఆధునాతన డ్రోన్ల కొనుగోలుకు భారత రక్షణశాఖ ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ డ్రోన్లు శత్రుదేశాల లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. వైమానిక దాడులను తిప్పికొడతాయి. రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేస్తే.. నిరంతరాయంగా దాదాపు 35 గంటల పాటు ఆకాశంలో గస్తీ కాసే సామర్థ్యం ఉంది.





