
-
మహిళల వాష్ రూమ్‌లో కెమెరాల ఏర్పాటు
తిరువనంతపురం: కేరళ దూరదర్శన్ కేంద్రంలో కామాంధులు తయారయ్యారు. తిరువనంతపురంలోని దూరదర్శన్ కేంద్రంలో మహిళ వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరా బయటపడడం కలకలం రేపుతోంది. ఆదివారం ఓ మహిళకు ఈ సీక్రెట్ కెమెరా దొరికింది. కేంద్రంలోని అధికారులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. ఇప్పుడు తిరువనంతపురం సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ సంస్థ తాత్కాలిక ఉద్యోగి కెమెరాను ఇన్‌స్టాల్ చేసినట్టు గుర్తించారు. అతడిని విధుల నుంచి తొలగించినట్టు అధికారులు చెప్పారు. దూరదర్శన్ కేంద్రంలోని మెయిన్ స్టూడియో సమీపంలోని వాష్‌రూమ్‌లో హిడెన్ కెమెరాను నిందితుడు పెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దూరదర్శన్ కేంద్రం అధికారులతో కూడిన మహిళా కమిటీ, క్రమశిక్షణా కమిటీలు విచారిస్తున్నాయి. తిరువనంతపురం సైబర్ సెల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కెమెరా ఒక్కటేనా.. ఇంకా ఉన్నాయా అనే విషయమై ఆరా తీస్తున్నారు. ఇంటర్నెట్‌లో వీడియోలను పెట్టేశారేమోననే అనుమానాలు కూడా అక్కడి ఉద్యోగినులను వెంటాడుతూ ఉన్నాయి.
Source: NationalistHub





