
ఓ చర్చి హిందూ దేవాలయంగా మారబోతోంది. ఎక్కడో కాదు అమెరికా లోనే..! అమెరికాలోని ఓ చర్చిని హిందు దేవాలయంగా మార్చబోతున్నారని తెలిసి హిందూ బంధువులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వర్జీనియాలోని పోర్ట్స్‌మౌత్‌లో 30ఏళ్ల క్రితం నిర్మించిన చర్చిని స్వామినారాయణ్ హిందూ దేవాలయంగా మార్చనున్నారు. చర్చిని పూర్తిగా దేవాలయానికి అనుగుణంగా మార్చిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేయబోతున్నారు. సంస్థాన్ ఆధ్యాత్మిక గురువు పురుషోత్తం దాస్ స్వామి మార్గదర్శకత్వంలో 30ఏళ్ల క్రితం నిర్మితమైన చర్చిని కొనుగొలు చేసి స్వామినారాయణ్ టెంపుల్‌గా పునరుద్ధరిస్తున్నామని సంస్థాన్ మహంత్ భగవత్ ప్రియదాస్ తెలిపారు.
అహ్మదాబాద్‌లో ఉన్న స్వామి నారాయణ్ సంస్థాన్ ఆధ్వర్యంలో ఇలా చర్చిలను దేవాలయాలుగా మారుస్తూ ఉన్నారు. ఈ వర్జీనియాలోని పోర్ట్స్‌మౌత్‌లోని చర్చి కొత్త ఆలయంగా మారనున్న ఆరో దేవాలయం అట. గతంలో అమెరికాలోని కాలిఫోర్నియా, ల్యూసెల్వీ, పెన్సుల్వేనియా, లాస్ ఏంజెల్స్, ఓహియోలో గల చర్చిలను దేవాలయాలుగా మార్చారు. ఈ సంస్థ ప్రపంచంలోని తొమ్మిది చర్చిలను దేవాలయాలుగా మార్చారు. 125 ఏళ్ల క్రితం నిర్మించిన కెనడాలోని టోరొంటో చారిత్రాత్మక చర్చ్‌ను కూడా కొనుగోలు చేసి స్వామి నారాయణ్ టెంపుల్‌గా ఆధునికీకరించారు. అలాగే లండన్‌తో పాటు మాంచెస్టర్ సమీపంలోని బోల్టన్‌లో చర్చిలను హిందూ ఆలయాలుగా మార్చారు.
Source : Bharath today





