News

చైనాలో హైవేలు, క్రీడా మైదానాలు మూసివేతకు కారణం కాలుష్యమా? కరోనానా?

447views

పెద్ద ఎత్తున నమోదవుతున్న కరోనా కేసులతో సతమతమవుతున్న చైనాకు మరో సమస్య వచ్చిపడింది. చైనా, ముఖ్యంగా రాజధాని బీజింగ్ నగరం ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది.

తీవ్ర బొగ్గు కొరత కారణంగా చైనా వ్యాప్తంగా విద్యుత్‌ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. దానికి పరిష్కారంగా అధికారులు దేశంలో బొగ్గు ఉత్పత్తి, వినియోగాన్ని భారీగా పెంచేశారు. దీంతో దేశ రాజధాని బీజింగ్ ‌తో సహా ఆయా నగరాల్లో ఒక్కసారిగా భారీ ఎత్తున వాయు కాలుష్యం పెరిగింది. దాంతో ఉత్తర చైనాలోనూ దట్టమైన కాలుష్య పొగలు కమ్ముకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 200 మీటర్ల కంటే ఎక్కువ దూరం కనిపించని దుస్థితి. దీంతో శుక్రవారం షాంఘై, టియాంజిన్, హార్బిన్ ‌తో సహా ప్రధాన నగరాలకు వెళ్లే రహదారులను మూసివేశారు. తీవ్ర వాతావరణ పరిస్థితులు, కాలుష్యం కారణంగా రాజధానిలోని పాఠశాలలు.. ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసులు, బహిరంగ కార్యకలాపాలను నిలిపేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇదంతా పైకి తెలుస్తున్న సమాచారం. కానీ దేశవ్యాప్తంగా తీవ్రంగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో చైనాలో కొద్ది రోజుల క్రితం లాక్ డౌన్ కూడా విధింపబడింది. ఇప్పుడు చైనాలో ఆ లాక్ డౌన్ ను కొనసాగించే ప్రయత్నంలో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా మరింత పరువు పోగొట్టుకోకుండా ఉండడం కోసమే ఇప్పుడు కాలుష్యం పేరుతో కొత్త నిబంధనలకు చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తెరతీసిందేమోననే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా జిత్తులమారి కమ్యూనిస్టు దురాక్రమణవాద చైనాని ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మకూడదన్నదే ప్రపంచంలో చాలా దేశాల నిశ్చితాభిప్రాయం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.