News

బిజెపీ వైఫల్యం చెందితే… దేశం బ్రిటీష్ పౌరుడు రాహుల్ గాంధి చేతుల్లొకి వెళుతుంది – సుబ్రహ్మణ్య స్వామి.

627views

2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా విజయం సాధించి, నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయమని రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ -ఐఎస్‌బీ లో శనివారం పూర్వ విద్యార్థులు నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ, బ్రిటిష్‌ పౌరసత్వం ఉన్న రాహుల్‌ గాంధీ ప్రధాని కాలేరని వ్యాఖ్యానించారు. “దాదాపు 300 -400 యేళ్ళ పాటు మన దేశాన్నిఫ్రాన్స్, డచ్, డెనిష్, బ్రిటీష్ రాజ్యాలు పాలించాయి. నూరేళ్ళ స్వాతంత్ర సంగ్రామం తరవాత మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. అలాంటి భారత్ విదేశీ మూలాలున్న సోనియా గాంధి నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉండి దాదాపు మూడు దశాభ్దాలు విదేశీ క్రీనీడలో ముక్కి మూల్గుతూనే ఉండినది. మన ప్రతిపక్షం ఇప్పుడు బ్రిటీష్ కుటుంబానికి ఊడిగం చేస్తూనే ఉంది. బ్రిటీష్ పౌరుడు రాహుల్ గాంధి భారత ప్రదాని ఎలా అవుతారు?” అని ఆయన వ్యాఖ్యానించారు.

హిందువుల మనోభావాలను గౌరవించి అయోధ్యలో మందిర నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లను కల్పిస్తాననడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌ సంపాదకులు భూపేంద్ర చౌబే కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు.