News

కర్ణాటక సరిహద్దు ప్రాంతాల పేర్లు మార్పు

688views

బెంగ‌ళూరు: కర్ణాటకలోని ముంబయి-కర్ణాటక ప్రాంతం పేరును కిట్టూర్‌-కర్ణాటకగా మారుస్తున్నట్టు ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. కర్ణాటక రాష్ట్రం ఏర్పడి 65 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం పేరు మార్పు ప్రకటన చేశారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వివాదాలు తరచూ తలెత్తుతున్న నేపథ్యంలో వాటికి పాత పేర్లనే కొనసాగించడంలో అర్థం లేదన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌-కర్ణాటక ప్రాంతాన్ని కల్యాణ-కర్ణాటకగా మార్చిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే ముంబయి-కర్ణాటక పేరును కిట్టూర్‌- కర్ణాటకగా మారుస్తున్నామన్నారు. త్వరలో జరగబోయే కేబినెట్‌ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేయనున్నట్టు సీఎం తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి