
811views
-
అశోక్ వాటికా ‘శిల’ విరాళం
అయోధ్య: శ్రీలంక మంత్రులు అయోధ్యను సందర్శించారు. ఈ సందర్భంగా అశోక్ వాటికా నుండి తెచ్చిన ‘శిల’ను విరాళంగా ఇచ్చారు. శ్రీలంక ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు.. అక్కడి హైకమిషనర్, డిప్యూటీ హైకమిషనర్‌తో కలిసి గురువారం (అక్టోబర్ 28) అయోధ్యలోని శ్రీరామ మందిరానికి చేరుకుని, శ్రీలంకలోని అశోక్ వాటికలోని సీతా మందిరం నుండి తీసుకువచ్చిన పవిత్రమైన ‘శిల’ను దానం చేశారు. ప్రముఖులు భగవాన్ శ్రీ రాంలల్లా సర్కార్‌కు పూజ, ఆరతి కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కాగా, శ్రీరాములు ఆలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.
Source: Organiser





