News

హర్యానా మేయర్ ఎన్నికలలో భాజపా ఘన విజయం.

849views

మూడు హిందీ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలలో పరాజయం ఎదురైనా వారం రోజులకే హర్యానాలోని మొత్తం ఐదు పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికలలో మొత్తం ఐదు మేయర్ పదవులను బిజెపి భారీ ఆధిక్యతలతో గెల్చుకోంది. ఈ రాష్ట్రంలో మొదటిసారిగా మేయర్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగడం గమనార్హం.

ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ సొంత నగరం కర్నల్ తో పాటు పానిపట్, యమునానగర్, జాట్ ల ఆధిపత్యం ఉండే రోహతక్, హిసార్ నగరాలలో సహితం మేయర్ పదవులను కైవసం చేసుకొంది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ గుర్తుపై పోటీ చేయకుండా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి మద్దతు ఇచ్చింది. రాష్ట్రంలో బిజెపి పట్ల ఏ వర్గంలో కూడా చెప్పుకోదగిన అసంతృప్తి లేదని ఈ ఎన్నికలు వెల్లడి చేశాయి.

యమునానగర్ లో మదన్ సింగ్ కు 40 వేలు, పానిపట్ లో అవినీత్ కు 75 వేల వరకు భారీ ఓట్ల ఆధిక్యత లభించింది. కర్నల్ లో కాంగ్రెస్, బీఎస్పీ, లోక్ దళ్ పార్టీల మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి ఆషా వాధ్వా పై బిజెపి అభ్యర్థి రేణు బాల 9,348 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. పానిపట్ లో కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అంశు పహ్వ పై బిజెపి అభ్యర్థి అవినీత్ 74,940 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఐదు నాగరాలలోకెల్లా ఇక్కడ అత్యధిక ఆధిక్యత లభించింది.

రాష్ట్రములో నూహ్ జిల్లా తర్వాత అత్యధిక సంఖ్యలో ముస్లింలు ఉండే యమునానగర్ లో రాకేష్ కుమార్ పై 40 వేల ఆధిక్యతతో బిజెపి అభ్యర్థి మదన్ సింగ్ గెలుపొందారు. ఇక జాట్ ల ఆధిపత్యం గల హిసార్, రోహతక్ లలో కూడా బిజెపి అభ్యర్థులు గెలుపొందారు. హిసార్ లో కాంగ్రెస్ సమర్ధించిన స్వతంత్ర అభ్యర్హ్ది రేఖపై బిజెపి అభ్యర్థి గౌతమ్ సర్దానా 28 వేల ఆధిక్యతతో గెలుపొందారు. ఇక రోహతక్ లో బిజెపి అభ్యర్థి మన్ మోహన్ సీతారామ్ పై 14 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టార్ ఈ ఎన్నికలను ప్రతిష్టాకరంగా తీసుకొని విస్తృతంగా బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. రేజర్వేషన్ల కోసం గతంలో హిసాయుత ఆందోళనలకు దిగిన జాట్ లలో బిజెపి పట్ల నెలకొన్న అసంతృప్తి తొలగి పోయిన్నట్లు ఈ ఫలితాలు వెల్లడి చేస్తున్నాయి. 2016లో హింసాత్మక ఆందోళనలు జరిగిన నెల రోజులకే జాట్ లతో పాటు ఐదు కులాలను బిసి – సి లుగా గుర్తిస్తూ, వారికి 10 శాతం రేజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకు వచ్చారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్ట్ ముందున్నది.

రాష్ట్ర జనాభాలో 29 శాతం మేరకు ఉన్న జాట్ లు 2014 ఎన్నికలలో మూకుమ్మడిగా బిజెపికి ఓట్లు వేయడంతో 90 సీట్లలో 47 అసెంబ్లీ సీట్లను, 10 లోక్ సభ సీట్లలో 7 సీట్లను బిజెపి గెల్చుకోగలిగింది.

Sorce: Nijam.