
హమీద్ నిహాల్ అన్సారీ.. 33 సంవత్సరాల ముంబై కి చెందిన ఇంజనీర్ 6 సంవత్సరాల పాటు పాకిస్థాన్ జైలులో నరకం అనుభవించాడు. ఎట్టకేలకు విడుదల అయ్యాడు. అతడు వాఘా బోర్డర్ లో భారత్ చేరుకున్నాడు. భారత విదేశాంగ శాఖా మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ ని హమీద్ నిహాల్ అన్సారీ ఈరోజు కలుసుకున్నాడు. ఆమెను కలుసుకున్న వెంటనే కన్నీటి పర్యంతమయ్యాడు. హమీద్ తో పాటు అతడి తల్లి, కుటుంబ సభ్యులు బుధవారం నాడు సుష్మా స్వరాజ్ ను కలుసుకున్నారు.
అన్సారీ తల్లి ఫౌజియా మాట్లాడుతూ.. అన్సారీ విడుదలకు ముఖ్య కారణం సుష్మా మేడమ్ అని చెప్పారు. మేరా భారత్ మహాన్.. మేరీ మేడమ్ మహాన్.. సబ్ కుచ్ మేడమ్ నే కియా హై(మొత్తం మేడమ్ సుష్మా చేశారు) అని చెప్పారు.
2012లో ఆన్ లైన్ లో పరిచయమైన పాకిస్థానీ అమ్మాయిని కలిసేందుకు అక్రమంగా పాకిస్థాన్ కి వెళ్ళాడు హమీద్ నిహాల్ అన్సారీ. 2012లో ఆఫ్ఘనిస్థాన్ ద్వారా పాకిస్థాన్ లోకి చొరబడ్డాడు. పాకిస్థాన్ కు చెందినట్టుగా నకిలీ గుర్తింపు కార్డును కూడా సంపాదించాడు. కానీ అతన్ని గుర్తించేశారు. పాకిస్థాన్ కు చెందినట్టుగా నకిలీ గుర్తింపు కార్డు ఉన్న అతన్ని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంది. మొదట అతడొక గూఢచారి అని అనుకున్నారు. అతడి కేసును 2015లో పాకిస్థాన్ మిలిటరీ కోర్టులో విచారణకు వచ్చింది. అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. మూడేళ్ల జైలు శిక్ష ఈ నెల 15తో ముగిసింది. దీంతో పాకిస్థాన్ జైలులో నుండి విడుదల అయ్యాడు. ఈరోజు వాఘా బోర్డర్ ను దాటి భారత్ లో అడుగుపెట్టాడు.
Source: Bharath Today.





