
612views
తిరుమల: తిరుమల తిరుపతి భక్తుల దర్శనాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ మెరుగైన సేవలను అందిస్తోంది. ఈ రోజు రూ.300 దర్శన టికెట్ల నవంబర్, డిసెంబర్ కోటాను విడుదల చేసింది టీటీడీ. రెండు నెలలకు సంబంధించి కోటాలో భాగంగా ఈ రూ.300 దర్శన టికెట్లు ఆన్‌లైన్ లో విడుదల చేసింది.
ఇందులో భాగంగా రోజుకి 12 వేల టికెట్లు విడుదల చేయనుంది దేవస్థానం. అలాగే శనివారం ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఇందులో భాగంగా రోజుకు 10 వేల సర్వదర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. సర్వర్ల సమస్య తలెత్తకుండా వర్చువల్ క్యూలో టికెట్ల కేటాయించనుంది. అయితే, ప్రతి రోజు ముందుగానే బుక్ చేసుకున్న వారికి మాత్రమే టికెట్లు కన్ఫర్మ్ అవుతాయి.
Source: Tv9





