News

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి జీఎస్ఎల్వీ-11

876views

జీఎస్ఎల్వీ-11 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 19/12/2018 బుధవారం సాయంత్రం 4:10 నిమిషాలకు నింగిలోకి రాకెట్‌ను పంపించారు శాస్త్రవేత్తలు. రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. ఎయిర్ ఫోర్స్ సమాచార వ్యవస్థ కోసం పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో ఇస్రో ఈ రాకెట్‌ను రూపొందించింది. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌ -11 రాకెట్‌ ద్వారా క్షేమంగా గమ్యం చేరడంతో జీశాట్‌ 7-ఏ ఉపగ్రహం 8 ఏళ్ల పాటు సమాచార రంగానికి సంబంధించి సేవలను అందించనుంది. శ్రీహరికోట ప్రయోగం కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ-11 ప్రయోగం జరిగింది. జీశాట్-7ఏ ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి వాహకనౌక ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహం బరువు 2,250 కిలోలు. ఎనిమిదేళ్లపాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది.

వార్నింగ్ కంట్రోల్, డ్రోన్లకు దిశ, గ్రౌండ్ స్టేషన్లకు సమాచార బట్వాడా తదితరాలను ఈ కొత్త శాటిలైట్ సమర్ధవంతంగా నిర్వహిస్తుందని వెల్లడించారు. ఈ శాటిలైట్ విశేషాలు పరిశీలిస్తే, దీని బరువు 2,250 కిలోలు. సైన్యం అవసరాల నిమిత్తం 2013లో ప్రయోగించిన జీ శాట్ 7 (రుక్మిణి) ఇప్పటికీ సేవలందిస్తుండగా, దానికి తోడుగా జీ శాట్ 7ఏ చేరనుంది. ఈ శాటిలైట్ ప్రయోగం ఈ సంవత్సరం ఇస్రో చేపడుతున్న 17వది కాగా, ఈ సంవత్సరానికి ఇదే చివరిది కానుంది.

Source: Bharath Today.