
సీనియర్ ఆర్.ఎస్.ఎస్ ప్రచారక్, సంస్కారభారతి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అమీర్ చంద్ జీ 16/10/2021 శనివారం సాయంత్రం 6.30 గంటలకు స్వర్గస్తులయ్యారు. దాదాపు 35-40 సంవత్సరాలుగా సంఘ్ ప్రచారక్ గా ఉన్న అమీర్ చంద్ జీ బీహార్, ఉత్తర్ ప్రదేశ్ లలో సంస్కార భారతి వ్యాప్తికి చాలా కృ షి సలిపారు. తదుపరి ఈశాన్య భారతంలో సంఘ కార్య విస్తరణకు అహర్నిశలు కృషి చేశారు. అక్కడ చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టారు. అరుణాచల్ ప్రదేశ్ లో 2014 లో నిర్వహించిన “ఏ మేరే వతన్ కే లోగో జర యాద్ కరో ఖుర్బాని….” కార్యక్రమం అత్యద్భుతం.
వారు ప్రభావవంతమైన మార్గదర్శి. కార్యకర్తలకు అనేక విషయాలపై అత్యంత సున్నితంగా మార్గదర్శనం చేసేవారు. కోవిడ్ కాలంలో చిన్న కళాకారుల కోసం నిధులను సేకరించడంలో ఆయన ప్రత్యేకమైన కృషి సల్పారు. మహమ్మారి సమయంలో ఆయన నిర్విరామంగా, నిస్వార్థంగా సమాజ సేవాకార్యంలో నిమగ్నమయ్యారు.





