News

జమ్మూ కాశ్మీర్ : భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

68views

పుల్వామాలోని పంపోర్ ‌లోని ద్రాంగ్ ‌బల్ ప్రాంతంలో శనివారం (అక్టోబర్ 16) భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించాయి.

శనివారం తెల్లవారుజామున లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఉమర్ ముస్తాక్ ఖండే ఆచూకీ తమకు లభించినట్లు కాశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. బాఘాట్, శ్రీనగర్ వద్ద జరిగిన ఇద్దరు పోలీసు సిబ్బంది హత్యలు మరియు ఇతర తీవ్రవాద కార్యకలాపాలతో ఉమర్ ముస్తాక్ కు సంబంధముంది. అతనితోపాటు అతని సహచారుడ్ని కూడా పోలీసులు మట్టుబెట్టారు.

“శ్రీనగర్‌లోని బాఘాట్‌లో టీ తాగుతూ ఉండిన ఇద్దరు పోలీసు అధికారులు మొహమ్మద్ యూసఫ్, సుహైల్ ఆహ్ లను చంపిన ఎల్ఈటీ ఉగ్రవాది ఉమర్ ముస్తాక్ ఖండే ఈరోజు పాంపోర్ ఎన్కౌంటర్‌లో హతమయ్యాడు.” అని కాశ్మీర్ జోన్ పోలీసులు ప్రకటించారు.

Source : ANI

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.