329
జెనీవా: ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా ముప్పు ఇంకా పోలేదని, వైరస్‌ను నియంత్రించే పద్ధతులు పాటించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) లోకానికి హెచ్చరించింది. గతవారం ప్రపంచవ్యాప్తంగా 31 లక్షల మంది కొత్తగా వైరస్ బారినపడ్డారని, అలాగే మరో 54 వేల మంది ప్రాణాలు కోల్పోయారని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడిరచింది.
ప్రస్తుతం కరోనా ముగిసిందని ఇష్టానుసారంగా బయట తిరుగుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా అయితే పరిస్థితి మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. వైరస్ తగ్గుముఖం పట్టినా.. కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.
Source: Tv9