జెనీవా: మలేరియాకూ వ్యాక్సిన్ వచ్చేసింది. ఇది ప్రపంచంలోనే మలేరియాకు తొలి టీకా. 2019 నుంచి ఆఫ్రికాలోని 8 లక్షల మంది పిల్లలపై చేస్తున్న ట్రయల్స్‌లో వ్యాక్సిన్ మంచి ఫలితాలను చూపించడంతో డబ్ల్యూహెచ్‌వో దానికి ఆమోదం తెలిపింది. ‘ఆర్టీఎస్, ఎస్/ఏఎస్01 (మాస్క్విరిక్స్ బ్రాండ్ నేమ్)’ అనే వ్యాక్సిన్‌ను ప్రపంచమంతా వినియోగించేందుకు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియేసస్ యస్ చెప్పారు.
నాలుగు డోసులుగా పిల్లలకు వ్యాక్సిన్ వేయాలని సూచించారు. తొలి డోసును పిల్లలకు ఐదు నెలల వయసులో వేయాలన్నారు. ఇప్పటిదాకా 23 లక్షల డోసుల వ్యాక్సిన్‌ను కెన్యా, ఘనా, మలావిల్లోని చిన్నారులకు ఇచ్చినట్టు చెప్పారు. వ్యాక్సిన్ 30 శాతం ప్రభావవంతంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న పిల్లల్లో 90 శాతం మందిలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వ్యాక్సిన్ ధర కూడా తక్కువే..!
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) లెక్కల ప్రకారం 2019లో 22.9 కోట్ల మంది దాని బారిన పడగా.. 4.09 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 67 శాతం మంది (2.74 లక్షలు) ఐదేళ్లలోపు పిల్లలే ఉండడం మరింత కలచివేసే విషయం. దాని నుంచి విముక్తి కల్పించేందుకు ఎన్ని మందులొచ్చినా ఫలితం ఉండట్లేదు. కొన్ని ఆఫ్రికా దేశాల్లో కేసులు తీవ్రంగా ఉంటున్నాయి. భారతదేశంలో కూడా మలేరియా కేసులు ప్రతి ఏడాదీ ఎక్కువగానే నమోదవుతూ ఉన్నాయి.
Source: NationalistHub