News

రావణ పాత్రధారి అరవింద్‌ ఇక లేరు

363views

ముంబై: రామానంద్‌ సాగర్‌ ‘రామాయణం’లో రావణుడి పాత్ర పోషించిన నటుడు అరవింద్‌ త్రివేది కన్నుమూశారు. అరవింద్‌ వయస్సు 82 ఏళ్ళు. అరవింద్‌ త్రివేది మంగళవారం రాత్రి ముంబైలో తుది శ్వాస విడిచారు. అరవింద్‌ కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి గుండెపోటు వచ్చిందని అరవింద్‌ త్రివేది మేనల్లుడు కౌష్తుబ్‌ త్రివేది తెలిపారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించే లోపే తుది శ్వాస విడిచారని కౌష్తుబ్‌ వెల్లడిరచారు. అరవింద్‌ త్రివేది అంత్యక్రియలు బుధవారం ముంబైలోని కాండివాలి వెస్ట్‌లో ఉన్న శ్మశానవాటికలో జరుగుతాయన్నారు.

రావణుడి పాత్రతో అరవింద్‌ పాపులర్‌

ఆబాలగోపాలాన్ని అలరించిన ధారావాహిక రామానంద్‌ సాగర్‌ రామాయణంలో రావణుడి పాత్రను అరవింద్‌ త్రివేది పోషించారు. రావణుడి పాత్రతో చాలా ప్రసిద్ధి పొందారు. అరవింద్‌ త్రివేది గొంతు కూడా రావణుడి పాత్రకు సరిగ్గా సరిపోయింది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి