News

ఉత్తర్‌ప్రదేశ్‌లో ల్యాండ్‌ జిహాద్‌!

665views
  • చంద్రశేఖర్‌ అజాద్‌ పార్కు ఆక్రమణ

  • ఆ స్థలంలో మృతదేహాల ఖననం

  • అక్రమంగా మసీదుల కట్టడాలు

  • అధికారుల చర్యలకు అడ్డగింత

  • ఓట్లకు బానిసైన నేతలు మౌనవ్రతం

  • సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటీషన్‌

  • ఆక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశం

  • స్వార్థపరులకు గుణపాఠం కానున్న న్యాయస్థానం ఉత్తర్వులు

అలహాబాద్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో ల్యాండ్‌ జిహాద్‌లు పెరిగిపోయాయి. ఏకంగా స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ బలదానం అయిన పార్కునే ఆక్రమించికుంటున్నాయి. ప్రశ్నించాల్సిన నేతలు ఓట్లకు బానిసై మౌనవ్రతంలో ఉన్నారు. చివరకు ధైర్యం చేసిన ఓ సామాజిక కార్యకర్త కృషి ఫలితంగా ఆ పార్కులో పుట్టిన అక్రమ నిర్మాణాలు మట్టిలో కలవనున్నాయి.

అలహాబాద్‌ హైకోర్టు ప్రయాగరాజ్‌లోని షహీద్‌ చంద్రశేఖర్‌ పార్కు వద్ద అక్రమంగా నిర్మించిన మసీదు, మందిరాలను కూల్చివేయాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మునీశ్వర్‌ నాథ్‌ భండారి, జస్టిస్‌ పియూష్‌ అగర్వాల్‌ ధర్మాసనం జారీ చేసింది. మంగళవారం ఆన్‌లైన్‌ విచారణలో, పిటిషనర్‌ తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరిశంకర్‌ జైన్‌ వాదించారు.

సెప్టెంబర్‌ 30న, అదే బెంచ్‌ ప్రయాగరాజ్‌ డివిజన్‌ కమిషనర్‌, జిల్లా మేజిస్ట్రేట్‌, సీనియర్‌ పోలీసు సూపరింటెండెంట్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌ పార్క్‌ సూపరింటెండెంట్‌, ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌, ప్రయాగరాజ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులు అక్టోబర్‌లో కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. అయిదు పార్క్‌లో నిర్మించిన అక్రమ మసీదు, సమాధి గురించి అడిగిన ప్రశ్నలకు ఈ వ్యక్తులు సమాధానం ఇవ్వనందున కోర్టు ఈ ఆదేశాన్ని ఇచ్చింది.

కోర్టు ఆదేశాల అనంతరం అధికారులు తమ పాలనా చర్యలకు దిగారు. రెండు రోజుల క్రితం కొంతమంది పరిపాలనా అధికారులు పార్కుకు చేరుకుని, ఆక్రమణలు తొలగించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. అయితే, అధికారులు ప్రజల నుండి వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. కానీ భారీ పోలీసు బలగాల మోహరింపు కారణంగా, ఆందోళనకారులు అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయారు. ఇప్పుడు కోర్టు… పార్కులో నిర్మించిన అన్ని అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించింది.

పిటిషనర్‌, సామాజిక కార్యకర్త జితేంద్ర సింగ్‌ బిసెన్‌ కోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ ఉత్తర్వు స్వార్థపరశక్తులకు ఒక గుణపాఠంగా అభివర్ణించారు. అంతకుముందు జూలై 1న, అలహాబాద్‌ హైకోర్టు పార్క్‌ నుండి అక్రమ పుణ్యక్షేత్రాలు, మసీదులు, సమాధులను తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై నోటీసు జారీ చేసింది.
గత 10-15 ఏళ్ళలో ఈ పార్కులో ఒక మసీదు, సమాధి నిర్మించారని ఆ పిటిషన్‌లో పిటిషనర్‌ ఆరోపించారు. ఇది మాత్రమే కాదు, ముస్లింలు… పార్కులో మృతదేహాలను కూడా ఖననం చేస్తున్నారు.

ఆ సమయంలో కోర్టు ఏప్రిల్‌ 24, 1987న పార్కులో ఆక్రమణ విషయంలో ఒక ఉత్తర్వు కూడా జారీ చేసింది. అయినప్పటికీ, పార్కు ఆక్రమణకు గురవుతూనే ఉంది.
పార్కులో ఒక దేవాలయం, సంగీత అకాడమీ, కొన్ని ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, మసీదు లేదా సమాధి ప్రస్తావన లేదు. పార్కు మొత్తం ఆక్రమణ రహితంగా ఉండాలని కోర్టు స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ, ఈ దిశగా ఖచ్చితమైన చర్యలు తీసుకోలేదు. ముస్లింలు దీనిని సద్వినియోగం చేసుకున్నారు. ఇంతకు ముందు సమాధిని నిర్మించారని చెబుతారు. అప్పుడు మసీదు నిర్మాణం ఏర్పాటు చేశారు. దీని తరువాత పార్కును శ్మశానవాటికగా మార్చారు. మృతదేహాలను అక్కడ ఖననం చేస్తున్నారు.

ఈ ఉద్యానవనంలోనే గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ తుది శ్వాస విడిచారు. ఫిబ్రవరి 27, 1931న, బ్రిటీష్‌ వారు చుట్టుముట్టినప్పుడు అతను తనను తాను కాల్చుకున్నాడు. ఆ సమయంలో ఈ ఉద్యానవనాన్ని ఆల్ఫ్రెడ్‌ పార్కుఅని పిలిచేవారు. ఆల్ఫ్రెడ్‌ ఒక ఆంగ్ల అధికారి. 1870లో అతను అలహాబాద్‌ పర్యటనకు వచ్చాడు. అతని జ్ఞాపకార్థం, ఈ పార్కు133 ఎకరాలలో నిర్మించారు. స్వాతంత్య్రం తరువాత, ఈ పార్కుకు అమర్‌ షహీద్‌ చంద్రశేఖర్‌ పార్కుఅని పేరు పెట్టారు. అంత గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడితో సంబంధం ఉన్న ఈ పార్కుపై ఆక్రమణ చిన్న విషయం కాదు. కేవలం కుట్రపూరితంగానే ఒక విభాగం ఆక్రమించింది. రాజకీయ నేతలు మౌనంగా ఉన్నారు. రాజకీయ నాయకులు తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ఇలా చేస్తున్నారు. ల్యాండ్‌ జిహాదీలు దీనిని సద్వినియోగం చేసుకున్నాయి.

Source: Panchjanya

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి