
-
అమీర్ టైర్ల కంపెనీ యాడ్‌పై దుమారం
ముంబాయి: అమీర్ ఖాన్ టైర్ల కంపెనీ యాడ్‌పై దుమారం రేగింది. ఇటీవల వివాహ దుస్తులమ్మే ఓ బ్రాండ్ నటి అలియా భట్‌తో తీసిన ‘కన్యాదాన్’ అడ్వర్టైజ్‌మెంట్ తీవ్ర విమర్శలకు గురయింది. ఆ వేడి చల్లారకముందే తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో అమీర్ ఖాన్ నటించిన చేసిన ఓ వ్యాపార ప్రకటనపై తీవ్ర దుమారం చెలరేగుతున్నది. అమీర్ ఖాన్ నటించిన సీయట్ టైర్ల కంపెనీ యాడ్ ఒకటి ఈ మధ్య విడుదల అయ్యింది. ‘రోడ్లు ఉంది పటాసులు(బాణసంచా) పేల్చడానికి కాదు’ అంటూ ఆ టైర్లను ప్రోత్సహించడం కోసం తన ఎదురుగా ఉన్న జనాలకు హితోక్తులు చెప్పడం వివాదాలకు దారితీసింది.
అమీర్ ఖాన్ ఈ యాడ్ చేయడం, పైగా తమ మతాన్ని కించపరిచేదిగా ఉందంటూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ అభ్యంతరాలు తారాస్థాయికి చేరగా.. సీయట్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ %దీశీవషశ్‌్‌ీబినఱఅసబజూష్ట్రశీపఱషబిజజుAు% వేల ట్వీట్లు, రీట్వీట్లతో నింపేస్తున్నారు. ఈ యాడ్ చేసింనందుకు నటుడు అమీర్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని, యాడ్‌ను తొలగించాలని సీయట్ కంపెనీని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక కొందరైతే ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయంకాను సహితం వివాదంలోకి తీసుకొస్తున్నారు.
గతంలోనూ ఇలా సున్నితమైన అంశాలపై హర్ష గోయెంకా అనుచిత ట్వీట్లు వేశాడని, ఆ సమయంలోను బాయ్‌కాట్ ఉద్యమం నడిచిందని కొందరు స్క్రీన్ షాట్లను రీట్వీట్లు చేస్తున్నారు. మతాన్ని, పండుగల్ని కించపరిచేలా సీయట్ కంపెనీ ప్రకటనలు తీయాల్సిన అవసరం, అందులో అమీర్ ఖాన్ లాంటి స్టార్ నటించాల్సిన అవసరం ఏముందని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
Source: Nijamtoday





