News

వ్యాసరచన పోటీల్లో ఢిల్లీ విద్యార్థిని ప్రతిభ

432views

లండన్‌: 2021 కోసం జరిగే ప్రతిష్ఠాత్మక రాయల్‌ కామన్వెల్త్‌ వ్యాసరచన పోటీల్లో సీనియర్‌ కేటగిరీలో ఢిల్లీకి చెందిన 11వ తరగతి విద్యార్థిని అదితి ఎస్‌ నాయర్‌ రన్నరప్‌గా ఎంపికయ్యారు. అమృత్‌సర్‌కు చెందిన మరో భారతీయ విద్యార్థి రైసా గులాటి జూనియర్‌ రన్నరప్‌గా నిలిచింది. అదితి బహుశా ఈ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి మలయాళీ కావచ్చు.

వ్యాసరచన పోటీని రాయల్‌ కామన్వెల్త్‌ సొసైటీ నిర్వహిస్తుంది. దీని ప్రధాన పోషకురాలు క్వీన్‌ ఎలిజబెత్‌ 2. సీనియర్‌ విభాగంలో ప్రథమ బహుమతి కెన్యా నుండి కైలా బోసిరెకు లభించగా, జూనియర్‌ విజేత ఇథాన్‌ ముఫుమా కాగా, ఇతను ఉగాండాకు చెందినవాడు.

క్వీన్స్‌ కామన్వెల్త్‌ వ్యాస రచన పోటీ అనేది పాఠశాలల విద్యార్థుల కోసం కేటాయించారు. ప్రపంచంలోని పురాతన అంతర్జాతీయ రచనా పోటీగా ప్రసిద్ధి చెందింది. దీనిని 1883లో మొట్టమొదట నిర్వహించారు. ప్రతి ఏడాది వేలాది మంది యువకులు ఈ పోటీలో పాల్గొంటారు. ఈ ఏడాది 25,648కి పైగా యువకులు తమ ఆలోచనలను పంచుకుంటూ ఎంట్రీలు సమర్పించారు.

అక్టోబర్‌ 28న లండన్‌లోని సెయింట్‌ జేమ్స్‌ ప్యాలెస్‌లో జరిగే కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. ఇండస్‌ స్క్రోల్స్‌ వ్యవస్థాపకుడు, ఎండీ, ఆర్గనైజర్‌ అసోసియేట్‌ ఎడిటర్‌ జి.శ్రీదాతన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిత్వ శాఖ డిడిజి బిందు శ్రీదాతన్‌ కుమార్తె అదితి. ఈమె ఢిల్లీలోని సంస్కృతి పాఠశాల విద్యార్థిని. ఆమె కేరళలోని పతనంతిట్ట జిల్లాకు చెందినవారు.

Source: Indus scrolls

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి