
-
పాక్ వల్లే ఆఫ్ఘన్ శాంతి పోరాటం విఫలం
-
అమెరికా వైఫల్యానికి ఆదేశమే ప్రధాన కారణం
-
దుమ్మెత్తిపోసిన సెనెటర్లు
వాషింగ్టన్ డిసి: అఫ్గానిస్థాన్‌లో అగ్రరాజ్యం 20 ఏళ్ల పాటు చేసిన యుద్ధాన్ని వ్యూహాత్మక వైఫల్యంగా అభివర్ణించారు అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ మార్క్ మిలే. అఫ్గాన్‌లో ప్రభుత్వం కుప్పకూలకుండా ఉండేందుకు 2,500 మంది జవాన్లను ఆ దేశంలో ఉంచాలని సిఫార్సు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్, సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ ఫ్రాంక్ మెకెంజీతో కలిసి.. సెనేట్ సాయుధ సేవల కమిటీకి ఈ వివరాలు వెల్లడించారు.
అఫ్గాన్ నుంచి బలగాలను ఉపసంహరించిన తీరుపై కమిటీలోని సెనేటర్లు కఠిన ప్రశ్నలు సంధించారు. అఫ్గానిస్థాన్‌లో అమెరికా వైఫల్యానికి ప్రధాన కారణం పాకిస్థానే అని సెనేటర్ జాక్ రీడ్ అన్నారు. తాలిబన్లకు పాకిస్థాన్ మద్దతు ఇవ్వకుండా అమెరికా అడ్డుకోలేకపోయిందని చెప్పారు. అఫ్గాన్ ఇప్పుడు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోయిందని, ఆ దేశ గగనతలాన్ని ఉపయోగించుకోవాలన్నా ఇప్పుడు పాకిస్థాన్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోందని మరో సెనేటర్ జిమ్ ఇన్హోఫే పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





