News

జిన్నా విగ్రహం బాంబుతో పేల్చివేత

709views

గ్వాదర్‌: పాకిస్తాన్‌లో మొహమ్మద్‌ అలీ జిన్నా విగ్రహాన్ని బాంబుతో పేల్చివేశారు. ఈ ఘటన బలూచిస్తాన్‌ తీర ప్రాంత నగరం గ్వాదర్‌లో జరిగింది. ఈ ఘటనకు పాల్పడిరది తామేనని బలూచ్‌ రిపబ్లికన్‌ ఆర్మీ(బీఆర్‌ఏ) ప్రకటించింది. ఈ మేరకు బీఆర్‌ఏ ప్రతినిధి బాబ్గర్‌ ట్వీట్‌ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు. గ్వాదర్‌ నగరంలో అత్యంత సురక్షితమని భావించే ప్రాంతంలో జిన్నా విగ్రహంను పేల్చేయడాన్ని సోషల్‌ మీడియాలో చర్చనీయమైంది.

గతంలోనూ..2013 జూన్‌లో జియారత్‌లోని మొహమ్మద్‌ అలీ జిన్నా ఇంటిని బాంబుతో పేల్చేశారు. ఈ ప్రాంతం కూడా బలూచిస్తాన్‌లోనే ఉంటుంది. ఆ సమయంలో ఇంట్లోని ఫర్నీచర్‌ కాలిపోయింది. జిన్నా తన జీవితం చివరి రోజుల్లో ఈ ఇంట్లోనే గడిపారు. ఆయన చనిపోయాక ఆ ఇంటిని మ్యూజియంగా మార్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి