News

పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ‌!

459views

లండన్‌: పాకిస్థాన్‌ క్రికెట్‌కు మరో షాక్‌! ఇంగ్లాండ్‌ కూడా న్యూజిలాండ్‌లో బాటలో పయనించింది. భద్రత కారణాలతో పాకిస్థాన్‌ పర్యటనను రద్దు చేసుకుంది. ఇంగ్లాండ్‌ పురుషులు, మహిళల జట్లు వచ్చే నెలలో పాక్‌లో ఆడాల్సివుంది.

‘పాకిస్థాన్‌ పర్యటనపై ఈసీబీ లోతుగా చర్చించింది. పురుషులు, మహిళల జట్లను పర్యటనకు పంపరాదని నిర్ణయించింది. క్రీడాకారులు, సహాయ సిబ్బంది మానసిక, శారీరక క్షేమం అన్నింటికంటే ముఖ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా ముఖ్యం.’
అని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు పేర్కొంది.

షెడ్యూలు ప్రకారం… ఇంగ్లాండ్‌ పురుషుల జట్టు వచ్చే నెల 13, 14వ తేదీల్లో పాక్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సివుంది. ఇంగ్లాండ్‌ మహిళల జట్టు రెండు టీ20లు, మూడు వన్డేల్లో పోటీపడాల్సింది. తొలి వన్డేకు కొన్ని నిమిషాల ముందు.. న్యూజిలాండ్‌ జట్టు పాకిస్థాన్‌ పర్యటనను రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ జట్టు ఇటీవలే పాకిస్థాన్‌ పర్యటనను రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి