News

చైనా దొంగ బుద్ది!

500views
  • ప్ర‌పంచ ర్యాంకింగ్‌లో అక్రమాలు

  • ప్రపంచబ్యాంకు వెల్లడి

  • నిప్పులు చెరిగిన భార‌త్‌

న్యూఢిల్లీ: చైనా దొంగ బుద్ది బ‌ట్ట‌బ‌య‌లైంది. వివిధ దేశాల్లో పెట్టుబడులు, వ్యాపార అనుకూలతలను తెలిపే ‘ఈజ్ ఆఫ్​ డూయింగ్ బిజినెస్​’ నివేదికను ప్రచురించడం నిలిపివేయాలని వరల్డ్ బ్యాంక్​ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నివేదికలో ఇచ్చే ర్యాంకింగ్స్​ను తారుమారు చేసేలా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలే ఇందుకు కారణంగా తెలిసింది.

ముఖ్యంగా 2017లో చైనా ర్యాంక్​ను పెంచాలని.. కొంత మంది ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిని ఒత్తిడి చేసినట్టు ఇటీవల ఓ కథనం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలు వరల్డ్ బ్యాంక్ దృష్టికి వెళ్లాయి. చైనా చేసిన అక్రమాలు ఇన్నాళ్లకు బయటపడ్డాయని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

ఇది భారత్​కు కచ్చితంగా కలిసొచ్చే విషయమని పేర్కొన్నాయి. ముఖ్యంగా తయారీ పరిశ్రమలు భారత్​కు తరలే అవకాశాలున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 2019లో వరల్డ్ బ్యాంక్ ప్రచురించిన ‘ఈజ్​ ఆఫ్​ డూయింగ్ బిజినెస్’​ నివేదికలో భారత్​ ర్యాంక్ 14 స్థానాలు మెరుగై.. 63కి చేరింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి