News

పాక్‌ ఉగ్రవాదుల చేతికి అమెరికా ఆయుధాలు

784views
  • అక్రమ రవాణాకు తాలిబన్ల బ్రేక్‌!

  • కాందహార్‌లో ట్రక్కు స్వాధీనం

కాందహార్‌: పాకిస్థాన్‌కు ఆయుధాలు, బాణాసంచా సామగ్రిని తీసుకెళ్తున్న ఓ ట్రక్కును తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. పెద్దసంఖ్యలో ఆయుధాలతో వెళ్తున్న ఓ ట్రక్కును కాందహార్‌ ప్రావిన్స్‌లో పట్టుకున్నట్టు పాక్‌ స్థానిక మీడియా పేర్కొంది. అఫ్గాన్‌లో అమెరికా సేనలు విడిచివెళ్లిన ఆయుధాలే లక్ష్యంగా పాక్‌ సరిహద్దుల్లో స్మగ్లింగ్‌ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన తాలిబన్లు.. పాకిస్థాన్‌కు భారీగా ఆయుధాల తరలించే కుట్రను భగ్నం చేశారు. హెల్మాండ్‌ ప్రావిన్స్‌ నుంచి వెళ్తున్న ట్రక్కును కాందహార్‌లోని డామన్‌ జిల్లాలో తాలిబన్లు సీజ్‌ చేసినట్టు పాక్‌ మీడియా వెల్లడిరచింది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని.. అలాగే ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించి విచారిస్తున్నట్టు పేర్కొంది.

చమన్‌ ద్వారా పాక్‌లోని ఉగ్రవాదులకు ఈ ఆయుధాలను అక్రమంగా చేరవేస్తున్నట్టు తాలిబన్‌ కమాండర్‌ చెప్పారని ఓ వార్తా సంస్థ పేర్కొంది. తాలిబన్లు.. అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత వాహనాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే 85 బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలను అమెరికా సేనలు విడిచివెళ్లినట్టు గతనెలలో అమెరికా నుంచి వార్త వెలువ‌డింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి