
649views
-
ఇస్రో మానవసహిత అంతరిక్ష యాత్ర
-
కేంద్ర మంత్రి ప్రకటన
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ యాత్ర 2022 చివరినాటికి లేదా 2023 ప్రారంభంలో జరుగుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మానవ సహిత యాత్ర కరోనా కారణంగా వాయిదా పడిందని చెప్పారు. భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య(ఫిక్కీ) నిర్వహించిన ఓ వెబినార్‌లో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు.
ప్రతి రంగంలోనూ స్పేస్ టెక్నాలజీకి పాత్ర ఉందని ఆయన గుర్తు చేశారు. అంతరిక్ష సాంకేతికతలో మరిన్ని అంకుర సంస్థలు రావాలని కేంద్రమంత్రి ఆకాంక్షించారు. స్పేస్ టెక్నాలజీలో ఓషియన్ దేశాల భాగస్వామ్యంతో ముందుకెళ్తామన్నరు. విపత్తు నిర్వహణలో అంతరిక్ష సాంకేతికత చాలా ఉపయోగకరంగా ఉందని జితేంద్ర సింగ్ కొనియాడారు.





