News

‘పీఎల్‌ఐ’తో భారతీయ వస్త్ర పరిశ్రమకు పూర్వవైభవం

712views
  • ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి

  • అయిదేళ్ళలో రూ. 10.683 కోట్ల విలువైన ప్రోత్సహకాలు

  • ఏపీతో సహా ఏడు రాష్ట్రాలకు మహర్దశ

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ దిశగా అడుగులు వేస్తూ, ఎంఎంఎఫ్‌ అపెరల్‌, ఎంఎంఎఫ్‌ ఫ్యాబ్రిక్స్‌, టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌ 10 విభాగాలు/ఉత్పత్తుల కోసం రూ. 10,683 కోట్లతో ఉత్పత్తి-లింక్డ్‌ ఇన్సెంటివ్‌(Production-Linked Incentive (PLI) scheme) పథకాన్ని ఆమోదించింది. వస్త్రపరిశ్రమ కోసం పిఎల్‌ఐతో పాటు ఆర్‌ఓఎస్‌సిటిఎల్‌, ఆర్‌ఓడీటీఈపీ, ప్రభుత్వ ఇతర చర్యలు.. ఉదాహరణకు…. సరసమైన ధరకు ముడిసరుకు అందించడం, నైపుణ్యాభివృద్ధి మొదలైనవి వస్త్రాల తయారీలో కొత్త యుగాన్ని తెస్తాయి.

2021-22 కేంద్ర బడ్జెట్‌లో టెక్స్‌టైల్స్‌ కోసం పిఎల్‌ఐ స్కీమ్‌లోని 13 రంగాల కోసం మొత్తం రూ. 1.97 లక్షల కోట్లు ప్రకటించారు. ఈ 13 రంగాలకు పిఎల్‌ఐ పథకాన్ని వర్తింపజేయడంతో భారతదేశంలో కనీస ఉత్పత్తి… సుమారు అయిదేళ్ళలో రూ. 37.5 లక్షల కోట్లు కాగా, అయిదేళ్ళలో కనీస అంచనా ఉపాధి దాదాపు కోటి. దేశంలో అధిక విలువ కలిగిన ఎంఎంఎఫ్‌ ఫ్యాబ్రిక్‌, వస్త్రాలు, సాంకేతిక వస్త్రాల ఉత్పత్తిని పీఎల్‌ఐ పథకం ప్రోత్సహిస్తుంది. ఫలితంగా ప్రపంచ వస్త్ర వ్యాపారంలో భారతదేశం దాని చారిత్రక ఆధిపత్యాన్ని తిరిగి పొందేందుకు మార్గం సుగమం అవుతుంది.

వివిధ రకాల ప్రోత్సాహకాలతో రెండు రకాల పెట్టుబడులకు వీలుకలుగుతుంది. ప్లాంట్‌, మెషినరీ, ఎక్విప్‌మెంట్‌, సివిల్‌ వర్క్స్‌(భూమి, అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌ ఖర్చు మినహా)లో కనీసం 300 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఎవరైనా (ఎంఎంఎఫ్‌ ఫ్యాబ్రిక్స్‌, గార్మెంట్‌), టెక్నికల్‌ ఉత్పత్తుల వస్త్రాలు, పథకం మొదటి భాగంలో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండవ భాగంలో ఏ వ్యక్తి అయినా (ఇందులో సంస్థ/కంపెనీ కూడా) కనీసం 100 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటే, ఈ పథకంలో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వీటితో పాటు ఆశించిన జిల్లాలు, టైర్‌ 3, టైర్‌ 4 పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ ప్రాధాన్యత కారణంగా వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమ స్థాపన ప్రోత్సహించినట్లువుతుంది. ఈ పథకం ముఖ్యంగా ఏపీతో సహా గుజరాత్‌, యూపి, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్‌, తెలంగాణ, ఒడిశా మొదలైన రాష్ట్రాలపై సానుకూల ప్రభావం చూపుతుంది.

అయిదేళ్ళ కాలంలో టెక్స్‌టైల్స్‌ కోసం పిఎల్‌ఐ స్కీమ్‌ రూ.19,000 కోట్లకు పైగా తాజా పెట్టుబడికి వీలుకలుగుతుందని ఒక అంచనా. రూ.3 లక్షల కోట్లకు పైగా టర్నోవర్‌ ఉంటుంది, అదనపు ఉపాధిని సృష్టిస్తుంది. వస్త్ర పరిశ్రమ ప్రధానంగా మహిళలకు ఉపాధి కల్పిస్తుంది. కాబట్టి, ఈ పథకం మహిళలకు సాధికారతనిస్తుంది, ఆర్థిక వ్యవస్థలో వారి భాగస్వామ్యాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు.

Source:pib

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి