News

కోయంబత్తూరులో ‘కరపత్రం పాస్టర్‌’ అరెస్టు!

817views

న్యూఢిల్లీ: కోయంబత్తూరులోని ఓ పాస్టర్‌ మతపరమైన ఉద్రిక్తతలకు పాల్పడడంతో పోలీసులు అరెస్టు చేశారు. హిందూ మతాన్ని రక్షించడానికి, హిందూ మత స్మారక కట్టడాలను రక్షించడానికి తమిళనాడుకు చెందిన మత, సాంస్కృతిక సంస్థ హిందూ మున్నాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సెయింట్‌ పాల్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పాస్టర్‌ వి.డేవిడ్‌ను కోయంబత్తూర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

ఆ పాస్టర్‌ మతపరమైన ఉద్రిక్తతను పెంచుతున్నాడని ఫిర్యాదుదారు ఆరోపించాడు. వినాయక చతుర్థి రోజున ప్రార్థన యాత్ర చేయమని ప్రజలను కోరుతూ వినాయక చతుర్థి ఊరేగింపులకు సంబంధించి కరపత్రాలను విడుదల చేశాడు. నిందితుడిని ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేశారు. 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. సెంట్రల్‌ జైలులో ఉంచారు.

బహిరంగ వేడుకలపై ఆంక్షలు పక్షపాత వైఖరే…

హిందూ మున్నాని తమిళనాడు అధ్యక్షుడు కాదేశ్వర సుబ్రమణ్యం మాట్లాడుతూ, ముందుగా అనుకున్నట్టుగానే చతుర్థిని జరుపుకొంటామని, కోవిడ్‌ -19 ని ఉటంకిస్తూ వినాయక చతుర్థి బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిరచారు. పండుగ నిర్వహణ కోసం దైవబలం కోసం తమిళనాడు వ్యాప్తంగా దేవాలయాల ముందు మున్నాని ప్రార్థనలు నిర్వహించినట్టు సుబ్రమణ్యం చెప్పారు. ప్రభుత్వం తన ఆంక్షలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, మున్నాని కార్మికులు తిరుపూర్‌, కోయంబత్తూర్‌ జిల్లాలలో 200 కి పైగా ప్రదేశాలలో దేవాలయాల ముందు ప్రార్థనలు నిర్వహించారు.
తమిళనాడులో వినాయక చతుర్థి వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని నిరసిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో గణేష్‌ విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని హిందూ మున్నాని ప్రకటించింది. ‘‘హిందూ మున్నాని ప్రతి సంవత్సరం వలె బహిరంగ ప్రదేశాలలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, నిమజ్జనం కోసం విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లే ముందు పూజలు చేస్తారు. రండి … ‘‘అని హిందూ మున్నాని రాష్ట్ర కార్యదర్శి కె.కుట్రాలనాథన్‌ పిలుపునిచ్చారు.

 

Source: Times NowNews.com

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి