News

మమతా బెనర్జీ మేనల్లుడి కనుసన్నల్లో బెంగాల్లో రూ.1352 కోట్ల బొగ్గు కుంభకోణం…ఈడీ సమన్లు

117views

శ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీతోపాటు ఆయన భార్య రుజిర బెనర్జీకి వేర్వేరుగా సెప్టెంబరు 6, 1 తేదీల్లో విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేటు (ఈడీ) తాజాగా సమన్లు జారీచేసింది. రాష్ట్రంలో బొగ్గు కుంభకోణానికి సంబంధించిన నిధుల దుర్వినియోగం కేసులో ప్రశ్నించేందుకు సమన్లు పంపినట్లు అధికారులు తెలిపారు. ఇదే కేసులో గతంలోనూ సీబీఐ అధికారులు రుజిరను ప్రశ్నించారు. కేసుతో సంబంధమున్న మరికొందరు ఐపీఎస్‌ అధికారులకు, ఓ న్యాయవాదికి కూడా సమన్లు వెళ్లినట్లు అధికారులు ధ్రువీకరించారు.

రాష్ట్రంలోని కునుస్తోరియా, కజోరా, ఆసనసోల్‌ ప్రాంతాలకు చెందిన ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌కు చెందిన దాదాపు రూ.1,352 కోట్ల విలువైన బొగ్గు గల్లంతుపై సీబీఐ గతేడాది నవంబరులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. దీని ఆధారంగా నిధుల దుర్వినియోగ నిరోధక చట్టం కింద ఈడీ కేసు పెట్టింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.