News

UP : రెండు వైద్య సంస్థలకు రామభక్త కళ్యాణ్ సింగ్ పేరు

717views

రామభక్త కళ్యాణ్ సింగ్ ‌ను గౌరవించుకోవడానికి, రాష్ట్రంలోని రెండు వైద్య సంస్థలకు ఆయన పేరు పెట్టనున్నట్లు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది.

బులంద్ ‌షహర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల మరియు లక్నోలోని సూపర్‌ స్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రికి రామభక్త్ కళ్యాణ్ సింగ్ పేరు పెట్టారు.

అంతకుముందు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలో రామ జన్మభూమికి వెళ్లే రహదారికి యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ పేరు పెడతామని ప్రకటించింది. అయోధ్యతో పాటు, లక్నో, ప్రయాగ్ ‌రాజ్, బులంద్‌ష హర్ మరియు అలీఘర్ ‌లలో ఒక్కో రహదారికి ఆయన పేరు పెట్టనున్నారు.

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ దీర్ఘకాలిక అనారోగ్యంతో శనివారం (ఆగస్టు 21) కన్నుమూశారు. ఆయన వయస్సు 89. ఆయన గొప్ప రామభక్తుడు, అయోధ్య రామమందిరం కోసం ఆయన తన ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేశారు. డిసెంబర్ 1992 లో అయోధ్యలో కర్ సేవకులపై కాల్పులు జరిపేందుకు అయన పోలీసులను అనుమతించలేదు.

సోమవారం (ఆగస్టు 23)న ఆయన అంత్యక్రియలు బులంద్ ‌షహర్ జిల్లా నరోరాలోని రాజ్ ‌ఘాట్‌లో ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం (ఆగస్టు 22) లక్నోలో రామభక్త కళ్యాణ్ సింగ్ ‌కు నివాళులర్పించారు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.