News

జమ్మూ కాశ్మీర్ లో త్రివర్ణ పతాకాల రెపరెపలు.. తీవ్రవాద సంస్థల ఉక్రోషం

446views

మ్మూ కాశ్మీర్ లోని లాల్ చౌక్ ప్రాంతంలో ఇటీవలే స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను మొదలుపెట్టారు. శ్రీనగర్‌లోని ఐకానిక్ క్లాక్ టవర్ ప్రాంతంలో త్రివర్ణం రెపరెపలాడుతోంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు శ్రీనగర్‌లోని క్లాక్ టవర్‌ను త్రివర్ణ దీపాలతో అలంకరించారు. రాత్రివేళ రంగు రంగుల విద్యుద్దీపాల మధ్య త్రివర్ణం ప్రకాశవంతంగా కనిపించేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్లాక్ టవర్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. కొత్త గడియారాలను సైతం అమర్చారు. ఇలాంటి దృశ్యం మొట్టమొదటిసారిగా ఆవిష్క్రతమైంది. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అక్కడి ప్రాంతంలో చాలా మార్పు వస్తోంది.

త్రివర్ణ పతాకాలు.. తీవ్రవాద సంస్థల ఉక్రోషం

గత కొన్ని రోజులుగా, వందలాది త్రివర్ణ పతాకాలు లోయలో కనిపించాయి. ఇది ఉగ్రవాద సంస్థలకు కోపం తెప్పించింది. దాల్ సరస్సు ప్రాంతంలో జాతీయ జెండా ఆవిష్కరించబడింది. లాల్ చౌక్ వద్ద క్లాక్ టవర్ కూడా స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు త్రివర్ణ దీపాలతో వెలిగిపోతోంది. 2019 లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుండి ఉగ్రవాద సంస్థలలో కొత్త నియామకాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. పెరిగిన పెట్రోలింగ్, భద్రతా దళాల కఠిన చర్యలు లోయ లోని ప్రజలలో మార్పు రావడం వల్ల ఈ ప్రాంతంలో పరిస్థితి మెరుగుపరచడం సాధ్యమైంది. గత రెండేళ్లలో దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం లోయలో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

Source : Nationalist Hub

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.