News

సింహాచలం ఆలయంలో కూలిన ధ్వజస్తంభం… తాత్కాలికంగా మరొకటి ఏర్పాటు..

904views

సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలోని ఉపాలయం శ్రీ సీతారామస్వామి సన్నిధిలోని ధ్వజస్తంభం కూలిపోయింది. బుధవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా ఆలయంలోని ధ్వజస్తంభం కూలడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. ధ్వజస్తంభం కూలిపోవడంలో ఎవరి ప్రమేయం లేదని నిర్ధాంచారు. పురాతనమైన ఈ ధ్వజస్తంభం లోపలి భాగంలో కర్ర పుచ్చిపోవడంతో.. అకస్మాత్తుగా కూలిపోయినట్లు వెల్లడించారు. ఈ సంఘటన ఉదయం 6.30గంటల సమయంలో జరిగినట్లు తెలిపారు. వేదమంత్రాలు, సంప్రోక్షణ అనంతరం తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ధ్వజస్తంభం ఏర్పాటు పనులు ప్రారంభించారు. పదిరోజుల్లో శాశ్వతంగా కొత్త ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తామని సింహాచల దేవస్థానం ఈవో సూర్యకళ వివరించారు. 60 ఏళ్ల క్రిందటి ధ్వజస్తంభమని.. లోపలి భాగంలోని కర్రకు చెదలు పట్టడంతో కూలిపోయినట్లు వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.