News

ఆఫ్గాన్ విషయంలో భారత్ ది నిర్ణయాత్మక పాత్ర.. అమెరికా వెల్లడి..

576views

ఆఫ్గనిస్థాన్ విషయంలో భారత్ నిర్మాణాత్మక పాత్ర పోషించిందని అమెరికా భద్రతా విభాగం పెంటగాన్ తెలిపింది. శిక్షణ, మౌలిక వసతుల కల్పనలో భారత్ పాత్ర విశేషమైనదని పెంటగాన్ మీడియా ప్రతినిధి జాన్ కిర్బీ అభివర్ణించారు. అఫ్గాన్ కు.. భారత్​- అమెరికా సంయుక్త సహకారంపై ఈ విధంగా మాట్లాడారు. అఫ్గాన్ లో స్థిరత్వం, సుస్థిర పరిపాలన కోసం భారత్ చేపట్టిన పనులు స్వాగతించదగ్గవని కిర్బీ అన్నారు. అఫ్గాన్ లో భద్రతా పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అన్నారు. అంతర్జాతీయంగా ఈ అంశంపై ఆందోళన నెలకొంటోందని.. అఫ్గాన్ సైన్యానికి తాలిబాన్లను ఎదుర్కొనే శక్తి ఉందని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.