News

భారత్ లో పెరగనున్న వైద్యుల సంఖ్య.. 2024 నాటికి వెయ్యి మందికి ఒక వైద్యుడు.. వెల్లడించిన నీతి ఆయోగ్

734views

భారత్ లో వైద్య, ఆరోగ్య రంగంలో గణనీయమైన మార్పులు రానున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్ అన్నారు. దేశంలోని ప్రతి 1000మందికి ఓ వైద్యుడు ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యాన్ని 2024 నాటికి అందుకోగలమని ధీమా వ్యక్తం చేశారు. ఆసుపత్రి పడకల సంఖ్యను 22 లక్షలకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. 75ఏళ్లలో దేశ ఆరోగ్య రంగం గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చే నాటికి భారతీయుల సగటు జీవిత కాలం కేవలం 28 సంవత్సరాలు మాత్రమేని.. ఇప్పుడు 70 ఏళ్లకు పెరిగినట్లు గుర్తు చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట‌మెంట్ నిర్వహించిన ‘అజాదీ కా అమృత్​ మహోత్సవ్’ అనే వర్చువల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.