News

భారత ఐటీ చట్టాలను పాటిస్తున్నామంటూనే కోర్టు ప్రమాణపత్రంలో చేర్చని ట్విట్టర్.. ఆగ్రహించిన ఢిల్లీ హైకోర్టు

628views

నూతన ఐటీ నిబంధనల ప్రకారం.. చీఫ్​ కంప్లైయన్స్​ ఆఫీసర్​(సీసీఓ), రెసిడెంట్​ గ్రీవెన్స్​ ఆఫీసర్​(ఆర్​జీఓ), నోడల్ కాంటాక్ట్​ అధికారులుగా శాశ్వత ఉద్యోగులను నియమించినట్లు దిల్లీ హైకోర్టుకు ట్విట్టర్​ తెలిపింది అయితే… ఈ మేరకు ట్విట్టర్​ దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో ఈ వివరాలు లేవని న్యాయస్థానం ఆక్షేపించింది. ఈ వివరాలన్నీ ఉండేలా చూడాలని తెలిపింది. ఈమేరకు ప్రమాణ పత్రం కాపీలను కేంద్ర కౌన్సిల్​ సహా ఇతర కక్షిదారులకు అందజేసినట్లు జస్టిస్​ రేఖా పల్లి పేర్కొన్నారు.సీసీఓ, ఆర్​జీఓ, నోడల్​ అధికారి పదవుల కోసం శాశ్వత అధికారులను నియమించామని ట్విట్టర్​ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సాజన్​ పూవయ్య.. కోర్టుకు నివేదించారు. నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఆగస్టు 4నే ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రమాణపత్రం దాఖలు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.