News

పాకిస్తాన్ లో విఘ్నేశ్వరుడి ఆలయాన్ని ధ్వంసం చేసిన ముస్లిములు

621views

పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని విగ్నేశ్వరుడి ఆలయాన్ని ఓ బృందం ధ్వంసం చేసింది. ఆలయంలోని చాలా భాగాలు దగ్ధమయ్యాయి. విగ్రహాలను అపవిత్రం చేశారు. రహీమ్ యార్ ఖాన్ జిల్లాలోని భోంగ్ నగరంలో బుధవారం నాడు ఈ దాడి చోటు చేసుకుంది.

ఈ విషయం తెలుసుకున్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్లమెంటేరియన్ డాక్టర్ రమేష్ కుమార్ వాంక్వానీ ట్విట్టర్‌లో దేవాలయంపై దాడి వీడియోలను పోస్ట్ చేశారు. దేవాలయాన్ని ధ్వంసం చేయడం ఆపాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరారు.

కర్రలు, రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. మతపరమైన నినాదాలు చేస్తూ దేవతల విగ్రహాలనును ధ్వంసం చేశారని వాంక్వానీ అన్నారు. వరుస ట్వీట్లలో ఆలయంపై దాడిని ఖండించారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చీఫ్ జస్టిస్ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆలయం బాగా దెబ్బతిన్నట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు. పోలీసులు అల్లరిమూకను నియంత్రించడంలో విఫలమైంది. దీంతో పరిస్థితిని నియంత్రించడానికి పాకిస్తాన్ రేంజర్‌లను పిలవవలసి వచ్చింది. ఈ ఘటనలో ఎవరినీ అరెస్టు చేయలేదు.

కొంతమంది వ్యక్తులు ఈ దాడిని సమర్థించడానికి ప్రయత్నించారు. ఎనిమిది సంవత్సరాల హిందూ బాలుడు గత వారం ఆ ప్రాంతంలోని ఒక ముస్లిం సెమినరీ లైబ్రరీ దగ్గర మూత్ర విసర్జన చేసాడు. 8 ఏళ్ల బాలుడు మూత్ర విసర్జన చేసినందుకు ప్రతీకారంగా ఆలయంపై కొందరు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ ఘటనలో 8 ఏళ్ల బాలుడిని పాకిస్తాన్ దైవదూషణ చట్టాల కింద గత వారం అరెస్టు చేశారు. కాని తరువాత మైనర్ అయినందున బెయిల్‌పై విడుదల చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.