News

కనీసం సెప్టెంబరు వరకైనా బూస్టర్ డోసు ఆపండి – సంపన్న దేశాలకు WHO వినతి

437views

కోవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్‌ డోసును అందించే ప్రణాళికలను కనీసం సెప్టెంబరు ముగిసే వరకు వాయిదా వేసుకోవాలని సంపన్న దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ పిలుపునిచ్చారు. ముందుగా అన్ని దేశాల్లో కనీసం 10% ప్రజలకు రెండు డోసులు అందేలా చూడాలని కోరారు. కరోనాపై పోరులో భాగంగా తమ పౌరులకు బూస్టర్‌ డోసు అందించే ప్రక్రియను ఇజ్రాయెల్, ఫ్రాన్స్, జర్మనీతో పాటు పశ్చిమాసియాలోని పలు దేశాలు ఇప్పటికే ప్రారంభించాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్‌ ముప్పును అధిగమించేందుకుగాను అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలు కూడా ‘బూస్టర్‌’ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జెనీవాలో బుధవారం విలేకర్ల సమావేశంలో అధనోమ్‌ మాట్లాడారు. కోట్ల మంది ప్రజలకు ఇప్పటికీ తొలి డోసు కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరు వరకు మూడో డోసు ఆలోచనలను మానుకోవాలన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.